టాలీవుడ్ యాంకర్ రష్మీ సైతం కుక్కల సంరక్షణపై మాట్లాడారు. ఇవాళ ప్రెస్‌క్లబ్‌లో ఆమె పాత సంప్రదాయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. మా అమ్మ, అమ్మమ్మ వాళ్లు మిగిలిన ఆహారాన్ని బయట కుక్కలకు పెట్టేవారని తెలిపింది. ఆ సంప్రదాయాలన్నీ మేము మర్చిపోయామని వెల్లడించింది. ఒకప్పుడు ఆవు అనే మన కుటుంబంలో సభ్యురాలిగా ఉండేదని పేర్కొంది. ఇప్పుడు ఆవుపాలను కూడా కల్తీ చేశామని వాపోయింది.
జున్ను పాలు అనేది ఆవు బిడ్డకే అందించాలి.. కానీ మనం మాత్రం జున్ను తింటున్నామని రష్మీ గౌతమ్ తెలిపింది. అది తిన్నా కూడా అరగదని వెల్లడించింది. ఇలాంటి వాటిని ఎవరూ ప్రశ్నించరని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో లెటర్స్ పంపడానికి పావురాలు పెంచుకున్నారు.. కానీ ఇప్పుడేమో అవసరం లేదని చంపేయండి అంటున్నారు. కుక్కలంటే ఒకప్పుడు డ్రైనేజీలో ఉండే ఎలుకలను తినేవి.. అప్పుడు ఎకోలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేదని తెలిపింది. డీ ఫారేస్టేషన్ వల్ల జింకలు కూడా రోడ్లమీదకు వస్తున్నాయని పేర్కొంది. పావురాలు , కుక్కలతో అవసరం లేదని వాటిని చంపుకుంటూ వెళ్తారా?.. అలాగే భవిష్యత్‌లో తల్లిదండ్రులు కూడా అడ్డంకిగా ఉన్నారని చంపేస్తారా? అంటూ రష్మీ ప్రశ్నించింది.
ఇదంతా కేవలం కుక్కల గురించి మాత్రమే కాదని రష్మీ గౌతమ్ వెల్లడించింది. ఇదంతా సోషల్ కండీషనింగ్ అని తెలిపింది. మేము ఫారిన్ బ్రీడ్స్‌కు బానిసలా తయారయ్యామని యాంకర్ వివరించింది.


