మెగాస్టార్‌ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులేసిన అనసూయ

Anasuya Bharadwaj Dance On Chiranjeevi Song In Jabardasth Show - Sakshi

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు పరిశ్రమలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఏం చేసిన అది సంచలనమే అవుతుంది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు గ్లామర్‌ అద్దిన ఈ యాంకరమ్మ తన అందచందాలతోనే కాకుండా అప్పడప్పుడు జబర్దస్త్‌ స్టేజ్‌పై చిందులేసి ప్రేక్షకులను మంత్ర‌ముగ్దుల‌ను చేస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన జబర్థస్త్‌ షోలో అనసూయ మెగాస్టార్‌ పాటకు స్టేప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. చిరంజీవి, రాధాలు హీరోహీరోయిన్లు నటించిన ‘లంకేశ్వరుడు’లోని జివ్వుమని కొండగాలి పాటకు అనసూయ తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి కుర్రకారును ఉర్రుతలుగిస్తోంది.

ఇందులో అనసూయ డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా తన టాలెంట్‌ బుల్లితెరకే పరిమితం చేయకుండా వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ సినిమాల్లో నటిస్తూ వెండితెర మీద కూడా ఆమె సత్తా చాటుతోంది. అయితే ఆమెకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి సినిమాలో ఓ కీలక పాత్రలో అనసూయ నటిస్తుండగా.. టాలీవుడ్‌ తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో హీరో కార్తికేయతో కలిసి చిందులేసింది. 

చదవండి:
 అవసరమైతే వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!
ఓ మై గాడ్‌! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top