విజయ్ దేవరకొండ హీరోయిన్.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బర్త్‌ డే సెలబ్రేషన్స్! | Sakshi
Sakshi News home page

Ananya Panday: లైగర్ భామ బర్త్‌ డే.. ప్రియుడితో మాల్దీవుల్లో మకాం!

Published Mon, Oct 30 2023 6:23 PM

Ananya Panday birthday in Maldives with rumoured Beau Aditya Roy Kapur - Sakshi

బాలీవుడ్ భామ అనన్య పాండే బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లైగర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తాజాగా ఈ ముంబై ముద్దుగుమ్మ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటోంది. తన బర్త్ డే వేడుకల కోసం మాల్దీవులకు చెక్కేసింది భామ. అంతే కాకుండా వేడుకలకు భాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకరోజు ముందే ఆమె ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ ముంబై విమానాశ్రయంలో వెళ్తూ కెమెరాలకు చిక్కారు.  దీంతో ఇద్దరు కలిసి బర్త్ డే వేడుకల కోసం మాల్దీవుస్‌కు వెళ్లినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తాజాగా ఈ బర్త్ డే భామ మాల్దీవుల్లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ది ఫర్‌ఫెక్ట్ హ్యాపీ బర్త్ డే మార్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి చాలాసార్లు వార్తల్లో నిలిచింది. ఆదిత్య రాయ్‌ కపూర్‌తో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే! ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్‌ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ లవ్‌ బర్డ్స్‌  షికారుకు వెళ్లగా.. ప్రియుడు ఆదిత్య కారు నడుపుతుంటే అనన్య అతడి పక్కనే కూర్చుని కనిపించింది. కాగా.. ఈ ఏడాది అనన్య పాండే.. డ్రీమ్ గర్ల్-2 చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించింది. 

చుంకీ పాండే స్పెషల్ విషెస్

అనన్య పాండే పుట్టిన రోజు సందర్భంగా ఆమె తండ్రి చుంకీ పాండే ఎమోషనల్ పోస్ట్ చేశారు. అనన్య త్రోబ్యాక్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనన్యతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ "హ్యాపీ హ్యాపీ హ్యాపీ సిల్వర్ జూబ్లీ మై డార్లింగ్..  లవ్ యు ఫరెవర్" అనే క్యాప్షన్‌తో తన ప్రేమను చాటుకున్నారు. కాగా.. ఆమె తండ్రి చుంకీ పాండే మూడు దశాబ్దాల కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించాడు.

 
Advertisement
 
Advertisement