ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్ | Ananya Nagalla OTT Debut With Bahishkarana Web Series | Sakshi
Sakshi News home page

Bahishkarana OTT: ఒక్క వెబ్ సిరీస్.. ఇద్దరు తెలుగు హీరోయిన్లు

Published Sun, Jun 16 2024 5:51 PM | Last Updated on Sun, Jun 16 2024 6:00 PM

Ananya Nagalla Debut OTT With Bahishkarana Web Series

ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.

(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)

మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది 'తంత్ర' అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొట్టేల్' అనే మూవీ ఉంది.

మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే 'బహిష్కరణ' సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

(ఇదీ చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్‌ చేసి..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement