
టీమిండియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో చివర్లో జరిగిన హైడ్రామాపై సోషల్ మీడియా వేదికగా అమితాబ్ రియాక్ట్ అయ్యారు. ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్‌కు తనదైన శైలిలో క్యాప్షన్ రాసుకొచ్చారు. అరే.. మనోడు తెల్లోడికి టీకా ఇచ్చిపడేశాడు అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టంట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం ఈ పోస్ట్ రీపోస్ట్ చేస్తున్నారు.
అయితే ఫోర్ట్ టెస్ట్‌లో జడేజా, సుందర్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రాకు అంగీకరించాలని జడేజాను కోరాడు. కానీ జడేజా, సుందర్ మ్యాచ్‌ను ముగించేందుకు నిరాకరించారు. అప్పటికీ ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో భారత బ్యాట్స్‌మెన్ డ్రాకు నిరాకరించారు. బెన్ స్టోక్స్ డ్రా ఆఫర్‌ను తిరస్కరించాక.. జడేజా, సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో టెస్ట్ డ్రాగా ముగించారు. మ్యాచ్ చివర్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన హంగామాతో సోషల్ మీడియాలో ట్రోల్ పెద్దఎత్తున వైరలయ్యాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో జడేజా 107 పరుగులు సాధించగా.. వాషింగ్టన్ సుందర్ 101 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు.
ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ సెక్షన్ 84 అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో నిమ్రత్ కౌర్, డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ పార్ట్-2లో నటించనున్నారు.
Take !?? अरे गोरे को टिका (tika - sorry tayka diya ) दिया रे !!🤣 https://t.co/1ybakYvNFM
— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2025