Amid Divorce Rumours Niharika Konidela Latest Denim Look Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Niharika Konidela : విడాకుల రూమర్స్‌.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న నిహారిక పిక్స్‌

Apr 14 2023 1:40 PM | Updated on Apr 14 2023 1:59 PM

Amid Divorce Rumours Niharika Konidela Latest Denim Look Pics Viral - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో కంటే ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు భార్యభర్తలిద్దదరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, మొదట చైతన్య పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్‌ చేయడంతో విడాకుల రూమర్స్‌ తెరమీదకి వచ్చాయి. ఇక రీసెంట్‌గా నిహారిక కూడా ఒక్క ఫోటో మినహా పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్‌ చేసేసింది.

నెట్టింట వీరి విడాకుల రూమర్స్‌ హాట్‌టాపిక్‌గా మారినా ఇంతవరకు స్పందించని నిహారిక హాట్‌ ఫోటోషూట్స్‌తో మాత్రం రచ్చ చేస్తుంది.  ఈ మధ్య సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె లేటెస్ట్‌ ఫోటోలతో ఫిదా చేస్తుంది. తాజాగా డెనిమ్‌ అవుట్‌ఫిట్‌లో ‍గ్లామర్‌ ట్రీట్‌తో ఎక్స్‌పోజింగ్‌లో నో కాంప్రమైజ్‌ అంటూ ఫోటోలను పోస్ట్‌ చేసింది. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement