అల్లు అర్జున్‌కు అనారోగ్యం.. అందుకే ఇక్కడకు రాలేదు: అల్లు అరవింద్‌ | Allu Arjun Why Not Participate Thandel Pre Release Event | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌కు అనారోగ్యం.. అందుకే ఇక్కడకు రాలేదు: అల్లు అరవింద్‌

Feb 3 2025 8:33 AM | Updated on Feb 3 2025 9:49 AM

Allu Arjun Why Not Participate Thandel Pre Release Event

అల్లు అరవింద్‌(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం  'తండేల్‌'. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. తండేల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ వస్తున్నారని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. కానీ, బన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని చివరిక్షణంలో తెలిపారు. అందుకు కారణాలను అల్లు అరవింద్‌ వివరించారు.

విదేశాల నుంచి అల్లు అర్జున్‌
తండేల్‌ ఈవెంట్‌ కోసం అల్లు అర్జున్‌ వస్తున్నారని తెలపడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా హాజరయ్యారు. అందుకు కారణాలను అల్లు అరవింద్‌ ఇలా చెప్పారు. 'ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు ముందుగా చెప్పాం. కానీ, బన్నీ  ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా అల్లు అర్జున్‌ రాలేదు. ఈ కార్యక్రమం కోసమే వేరే దేశం నుంచి అదే పనిగా హైదరాబాద్‌ వచ్చాడు. అయితే, తీవ్రమైన గ్యాస్‌ సంబంధిత సమస్య కారణంగా బన్నీ ఈ కార్యక్రమానికి రాలేదు' అని అల్లు అరవింద్‌ తెలిపారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్  బోర్డర్‌ క్రాస్‌ చేసి, అక్కడి కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఇదే కథను  ఆధారంగా చేసుకుని ‘తండేల్‌’ తీశారు. ఈ ఘటనలో నిజంగా భాగమైన వారిలో తండేల్‌ రామారావు, రాజు, కిశోర్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, వారి అనుభవాలను పంచుకున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆ మత్సకారులను నాగచైతన్య వేదిక పైకి పిలిచారు. వారిపై ప్రశంసలు కురింపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement