వచ్చే ఏడాదే రిలీజ్‌? | Allu Arjun upcoming movie updates | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదే రిలీజ్‌?

Nov 15 2025 3:55 AM | Updated on Nov 15 2025 3:55 AM

Allu Arjun upcoming movie updates

‘పుష్ప 2: ది రూల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని, భారీగా గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

కానీ ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని, ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ను అట్లీ పక్కాగా ప్లాన్‌ చేయడమే ఇందుకు కారణమనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే చాన్స్‌ ఉందట. షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌తో కొనసాగుతుండటంతో 2026లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట.

ఇక ఈ చిత్రం షూటింగ్‌ షెడ్యూల్స్‌ విషయానికొస్తే... డిసెంబరు – జనవరి మధ్యలో ఓ కీలక షెడ్యూల్‌ను అట్లీప్లాన్‌ చేశారట. ఈ షెడ్యూల్‌ పూర్తయితే ఈ మూవీ రిలీజ్‌పై మేకర్స్‌ నుంచే ఓ స్పష్టత రావచ్చని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. మే నాటికి షూటింగ్‌ పూర్తి చేసేసి, దసరాకు విడుదల చేయాలన్నది టీమ్‌ప్లాన్‌ అని టాక్‌. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement