అల్లు అర్జున్ సరికొత్త రికార్డు.. ‘సౌత్ కా సుల్తాన్’గా ఐకాన్ స్టార్

Allu Arjun Created New Record In Instagram - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏదైనా కూడా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో రికార్డులు సృష్టిస్తుంటాడు బన్నీ. ఇక తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్‌. సౌత్ ఇండస్ట్రీలోనే ఏ ఇతర హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోవర్స్‌ సంపాదించుకున్నారు బన్నీ. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు అల్లు అర్జున్‌. అంటే కోటి 30 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు బన్నీ. దీనితో సౌత్ ఇండస్ట్రీలోనే ఈ రికార్డును అందుకున్న తొలి కథానాయకుడిగా నిలిచాడు.

ఇదంతా తను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను తెరిచిన నాలుగేళ్లలోనే అల్లు అర్జున్‌ ఈ ఘనత సాధించడం విశేషం. 2017వ సంవత్సరం నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు అల్లు అర్జున్. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ వచ్చారు బన్నీ.

అలా క్రమంగా తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ప్రస్తుతం ఏకంగా 13 మిలియన్ మైలురాయిని అందుకున్నారు అల్లు అర్జున్. ఈ ఘనతను సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యారు బన్నీ. దానితో ఇప్పుడు తన అభిమానులు అల్లు అర్జున్‌ను 'సౌత్ కా సుల్తాన్' అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు.

ఇక ఇదే విషయంపై అల్లు అర్జున్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు తన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు అని అల్లు అర్జున్ తెలిపారు. ఇదే కాకుండా అల్లు అర్జున్‌కు ట్విట్టర్‌లోనూ 6 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగివున్నారు అల్లు అర్జున్. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ 'పుష్ప' చిత్రంతో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2021  క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఒకేరోజు విడుదల కానుంది పుష్ప.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top