హీరో అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్‌కు రావడం, అల్లు అర్జున్‌ను కలవడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా దాదాపు ఖరారు అయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మైత్రీ మూవీమేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత లోకేశ్‌తో చేయనున్న సినిమా షూట్‌లో అల్లు అర్జున్ పాల్గొంటారని ఊహించవచ్చు. అలాగే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో..’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని, సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో ఆధ్మాత్మిక టచ్‌తో ఈ సినిమా కథ సాగుతుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


