
హీరో అల్లు అర్జున్‌కి అరుదైన ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఆగస్టు 21న న్యూయార్క్‌లో జరగనున్న ‘గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్’కి ఆయనకు ఇన్విటేషన్ అందింది. ఈ విషయాన్ని ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్’ ప్రకటించింది. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ నిర్వహించనున్నారు. ఈ నెల 12 ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్ తన 4వ పరేడ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించింది.
చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు
ఈ సందర్భంగా ఆగస్టు 21న జరిగే 40వ భారత దినోత్సవ పరేడ్‌కు అల్లు అర్జున్ నాయకత్వం వహిస్తారని ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్’ అధ్యక్షుడు కెన్నీ దేశాయ్ తెలిపారు. ఈ వేడుకలోనే భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో అల్లు అర్జు¯Œ తో పాటు ఎన్‌వైసీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సహా ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.