Allu Aravind Says He Is Proud Of Allu Arjun For Two Reasons - Sakshi
Sakshi News home page

Allu Aravind : 'ఈ రెండు కారణాల వల్ల అల్లు అర్జున్‌ చూసి గర్వపడుతున్నా'

Feb 21 2023 4:00 PM | Updated on Feb 21 2023 4:38 PM

Allu Aravind Says He Is Proud Of Allu Arjun For Two Reasons - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ను చూసి గర్వపడుతున్నానని అల్లు అరవింద్‌ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కొడుకు బన్నీపై ప్రశంసలు కురిపించారు. 'గతంలో నన్ను స్టార్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ అని పిలిచేవారు. నా సినిమాల గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

కొంతమంది అయితే వాళ్ల పిల్లలకు నన్ను అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌ అని పరిచయం చేస్తున్నారు. ఒక తండ్రికి ఇంతకన్నా గుర్తింపు ఏం ఉంటుంది?  ఒక తండ్రిగా నాకు అది గర్వకారణం.బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు మరోసారి గర్వపడుతున్నా. ఇక నా మనవరాలు అల్లు అర్హ కూడా సినిమాల్లోకి వచ్చేసింది.

సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో అర్హ కీలక పాత్రలో నటించింది. తనను స్క్రీన్‌పై  చేసేందుకు మేమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్‌ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement