'అమిర్ ఖాన్‌తో వెయ్యి కోట్ల సినిమా'.. తండేల్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ కామెంట్స్ | Allu Aravind Interesting Comments On Aamir Khan Ghajini Sequel, Deets Inside | Sakshi
Sakshi News home page

AllAllu Aravind: 'అమిర్ ఖాన్‌ మాతో ఛాలెంజ్ చేశారు.. అందుకే వెయ్యి కోట్ల సినిమా: అల్లు అరవింద్

Jan 31 2025 7:57 PM | Updated on Jan 31 2025 8:26 PM

Allu Aravind Interesting Comments On Aamir Khan Ghajini Sequel

అక్కినేని నాగచైతన్య తండేల్(Thandel Movie) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌(Allu Aravind) ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమిర్ ఖాన్‌(Amir Khan) గజిని (Ghajini)సినిమాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అప్పట్లో గజిని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచిందన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ‍అమిర్ ఖాన్‌ మాతో ఛాలెంజ్ చేశారని గుర్తు చేసుకున్నారు. కచ్చితంగా వందకోట్లు రాబడుతుందని అన్నారని.. అందుకే మేం ప్రమోట్ చేసినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఇవాళ ముంబయిలో జరిగిన తండేల్ హిందీ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే ఈవెంట్‌లో అల్లు అరవింద్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు. అప్పుడు రూ.100 కోట్లు ఎక్కువని.. ఇప్పుడైతే రూ.1000 కోట్లు రాబట్టే సినిమా తీయాలనుందని ఆయన అన్నారు. అది గజిని-2 కూడా కావొచ్చని అరవింద్‌ నవ్వుతూ మాట్లాడారు. అయితే కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన గజిని చిత్రాన్ని హీందీలో రీమేక్ చేశారు. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన గజిని.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. మరోవైపు గజిని-2 కూడా ఉంటుందని గతంలో సూర్య హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం తండేల్‌. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల తెలుగులో ట్రైలర్ రిలీజ్‌ చేసిన మేకర్స్.. తాజాగా హిందీలోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్స్ట్‌ బ్యానర్‌లో బన్నీవాసు నిర్మించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement