ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్‌కు మరో షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్! | Allu Ajrun Pushpa 2 The Rule OTT Platform Netflix Gives Update | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule OTT: పుష్ప అంటే ఫ్రీ అనుకుంటివా?.. దుడ్డు కట్టాల్సిందేనట..!

Jan 29 2025 3:30 PM | Updated on Jan 29 2025 5:25 PM

Allu Ajrun Pushpa 2 The Rule OTT Platform Netflix Gives Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'పుష్ప-2 ది రూల్'. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజైంది. పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఏకంగా బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్‌ సినిమాల రికార్డులను ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం అమిర్ ఖాన్ నటించిన దంగల్‌ రికార్డ్‌పై కన్నేసిన పుష్పరాజ్‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

అయితే ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ త్వరలోనే రానుందని ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చేసింది. అయితే ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు పుష్ప-2 జనవరి 30న రానుందని నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించింది. దీంతో అందరూ ఆ తేదీనే ఫిక్సయిపోయారు. కానీ అది పొరపాటున అలా రివీల్ చేశారో తెలీదు.. కాసేపటికే కమింగ్ సూన్ అంటూ ఆడియన్స్‌కు షాకిచ్చింది.

పుష్ప-2 ఫ్రీ కాదట..

అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ పుష్ప అభిమానులకు మరో షాకిచ్చింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్న ఓటీటీ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. పుష్ప-2 ఓటీటీలో చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాలని ట్రైలర్‌ వీడియోను రిలీజ్ చేసింది. అంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్‌ చెల్లించాల్సిందే. దీంతో ఓటీటీలో ఫ్రీగా చూసేద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

బాక్సాఫీస్ వద్ద జోరు..

పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు  గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్‌ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా  సాధించలేని రికార్డ్స్‌ పుష్ప2 క్రియేట్‌ చేసింది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి  సీక్వెల్‌గా 2024 డిసెంబర్‌ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement