ఆలియా లైవ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌.. జూమ్‌ చేసి మరీ ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Alia Bhatts Fans Spot Ranbir Kapoor In Old Live Session Video Now viral - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌ పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రణ్‌బీర్‌ కపూర్‌ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. కరోనా కారణంగా తమ  వివాహం వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే పెళ్లి జ‌రిగి ఉండేద‌ని తెలిపాడు. కాగా ఎప్పటికప్పుడు పార్టీలు, డిన్నర్‌ డేటింగులతో చక్కర్లు కొడుతూ పలుసార్లు మీడియాకు చిక్కారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని, అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌​ అవుతుంది.

కాగా జంతువులు, ప్రకృతిపై తనకున్న ప్రేమ గురించి ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చెప్తుండగా కర్టెన్‌ వెనక నుంచి రణ్‌బీర్‌ కనిపించారు. ఆలియా లైవ్‌ వీడియోలో రణ్‌బీర్‌ను జూమ్‌ చేసి మరీ గుర్తించిన నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్లు చేసేస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్పడిది కాదు. గతేడాది లాక్‌డౌన్‌లో రణ్‌బీర్‌-ఆలియా ఓకే ఇంట్లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆలియా లైవ్‌ సెషన్‌లో కనిపించింది రణ్‌బీరేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వీడియోలో ఇద్దరూ వైట్‌ అండ్‌ వైట్‌ దుస్తుల్లో కనిపించారు. కాగా ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఈ జంట మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే.

చదవండి : నా కొడుకు లవ్‌ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం
‘ఇద్దరితో బ్రేకప్‌.. అతడిని ఎలా లవ్‌ చేస్తున్నావ్‌?’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top