
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)లాగే ఆమె కూతురు రాహా (Raha) కూడా అంతే అందంగా, క్యూట్‌గా ఉంటుంది. కూతురి ఫోటోల్ని, తనతో గడిపే సంతోకర క్షణాలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఆలియా. అయితే సడన్‌గా ఆ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పలువురూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కూతురి ముఖం కనిపించేలా ఉన్న ఫోటోలను హీరోయిన్ తొలగించిందని పేర్కొంటున్నారు. రాహా ముఖం కనిపించకుండా ఉన్న ఒకటీ రెండు పిక్స్ మాత్రం అలాగే ఉంచిందని చెప్తున్నారు. అయితే ఇందుకుగల కారణం మాత్రం తెలియాల్సి ఉంది.
ఇదే మంచి పని!
పిల్లల ప్రైవసీ కాపాడేందుకే ఇలా చేసి ఉంటుందని టాక్! 'అయినా పేరెంట్స్‌గా ఏం చేయాలన్నది వారిష్టం.. నిజం చెప్పాలంటే ఇది మంచి నిర్ణయమే.. రాహాను ఈ పబ్లిసిటీకి దూరంగా ఉంచడం చాలా మంచి పని..', 'ఈ పిచ్చి జనాలు రాహా నిష్కల్మషమైన నవ్వును, తను అందరికీ హాయ్ చెప్పడాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆమెకు అటెన్షన్ డిజార్డ్ ఉందని ఏవేవో వ్యాధులు అంటగడుతున్నారు. ఇలాంటివాటి నుంచి ఆమెను కాపాడటం చాలా అవసరం' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) దంపతులకు 2022 నవంబర్‌లో రాహా జన్మించింది.
చదవండి: సౌత్‌లో ఇదే పెద్ద సమస్య.. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి: జ్యోతిక