Alia Bhatt : ఆలియా భట్ కూతురి పేరు వెనుక ఇంత పెద్ద హిస్టరీ ఉందా?

Alia Bhatt Ranbir Kapoor Daughter Named Raha See What It Means - Sakshi

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ ఆలియా భట్‌--రణ్‌బీర్‌ కపూర్‌ ఇటీవలె పేరెంట్స్‌గా ప్రమోట్‌ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా తాజాగా తన కూతురి పేరును రివీల్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది. ఇంతకీ ఆ పేరు ఎవరు పెట్టారు? దానివెనకున్న అర్థాలేంటో కూడా వివరించింది ఆలియా. కూతుర్ని ఎత్తుకున్న ఫోటోను షేర్‌ చేసిన ఆలియా తన బుజ్జాయికి రాహా అని పేరు పెట్టినట్లు చెప్పింది.

ఈ పేరును రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి, నీతూకపూర్‌ సూచించిందట. అయితే మా కూతురు రాహ పేరుకు ఎన్నో అర్థాలు ఉన్నాయని అనేక భాషల్లో అనేక అర్థాలు ఉన్నాయని వివరించింది.రాహా అంటే దైవ మార్గమని,  స్వాహిలి భాషలో ఆనందమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని అనేక అర్థాలున్నట్లు తెలిపింది.

ఇక రాహా రాకతో లైఫ్‌ ఇప్పుడే కొత్తగా ప్రారంభమైందని పేర్కొంది. ప్రస్తుతం ఆలియా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆలియా-రణ్‌బీర్‌క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా  ఆలియా-రణ్‌బీర్‌ దంపతులు ఈ ఏడాది  ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top