Alia Bhatt Rejects Jr NTR and Koratala Siva's Next Film? - Sakshi
Sakshi News home page

తారక్‌ చిత్రం నుంచి తప్పుకున్న ఆలియా..?

Apr 17 2022 12:02 AM | Updated on Apr 17 2022 11:07 AM

Alia Bhat Out From Jr NTR Koratala Siva Movie - Sakshi

ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత బాలీవుడ్ భామ ఆలియా భట్ యంగ్‌టైగర్‌ జూ.ఎన్టీఆర్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఆ సమయంలో ఆలియా కూడా తారక్‌తో కలిసి నటించడానికి ఉత్సాహం చూపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ చిత్రం నుంచి ఆలియా తప్పుకున్నట్టు తెలుస్తోంది. 

తన బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌ స్టార్‌ రణబీర్ కపూర్‌తో ఆలియా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఈ జంట హనీమూన్‌ ట్రిప్‌కి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత ముందుగా వారు కమిటైన సినిమాలను పూర్తి చేయాలి. దాంతో తారక్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆలియా ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను వెతికే పనిలో ఉన్నారట కొరటాల టీమ్. ఇక దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement