ఓటీటీలోకి అక్షయ్‌ కుమార్‌ ‘సెల్ఫీ’, ఎక్కడంటే..? | Akshay Kumar Selfie Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

Selfie: రూ. 110 కోట్లతో సినిమా.. 25 కోట్లు కూడా రాలేదు..ఇప్పుడు ఓటీటీలోకి..

Apr 22 2023 6:36 PM | Updated on Apr 22 2023 6:37 PM

Akshay Kumar Selfie Movie OTT Release Date Out - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘సెల్ఫీ’. మలయాళ సూపర్‌ హిట్‌ ‘డ్రైవిండ్‌ లైసెన్స్‌’కు హిందీ రీమేక్‌ ఇది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తాపడింది. రాజ్ మెహ‌తా డైరెక్షన్‌లోదాదాపు రూ. 110 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కితే.. పట్టుమని పాతిక కోట్లను కూడా వసూలు చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు మేకర్స్‌. నేటి(ఏప్రిల్‌ 22) నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో  ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. 

సెల్ఫీ కథ ఇదే..
విజయ్‌ (అక్షయ్‌కుమార్‌) ఒక స్టార్‌ హీరో. ఎస్సై ఓం ప్రకాశ్ అగర్వాల్‌ (ఇమ్రాన్‌ హష్మీ) అతనికి వీరాభిమాని. అతన్ని ఎలాగైన కలిసి ఒక సెల్ఫీ తీసుకోవాలనేది అతని కోరిక. అయితే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే క్రమంలో హీరో విజయ్‌.. ఎస్సై  ఓం ప్రకాశ్‌ అగర్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో ఓం ప్రకాశ్ అగర్వాల్‌ఈగో దెబ్బతింటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే సెల్ఫీ కథ.

Advertisement
 
Advertisement
Advertisement