Akkineni Nageswara Rao Fans Protest Against Nandamuri Balakrishna In Nellore - Sakshi
Sakshi News home page

Balakrishna Akkineni Controversy: 'నోరు అదుపులో పెట్టుకోకుంటే బాలయ్యకు గుణపాఠం చెప్తాం'

Jan 25 2023 12:29 PM | Updated on Jan 25 2023 1:17 PM

Akkineni Nageswara Rao Fans Protest Against Nandamuri Balakrishna In Nellore - Sakshi

తాగే బ్రాండ్‌ అయినా మార్చుకో లేదా మాట తీరైనా మార్చుకో అని నినాదాలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు.

తెలుగు సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖించిన దిగ్గజాలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. జనవరి 22న ఆయన వర్ధంతి కాగా అదేరోజు నందమూరి బాలకృష్ణ 'అక్కినేని తొక్కినేని' అంటూ ఏఎన్నార్‌ను కించపరిచేలా మాట్లాడటంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వరుసగా సినిమాలు విజయం సాధించడంతో బాలకృష్ణకు గర్వం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నెల్లూరులో ఏఎన్నార్‌ అభిమానులు బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. నర్తకి సెంటర్‌లో బాలయ్య ఫ్లెక్సీని దగ్ధం చేశారు. వెంటనే బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాగే బ్రాండ్‌ అయినా మార్చుకో లేదా మాట తీరైనా మార్చుకో అని నినాదాలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు.

చదవండి: విజయ్‌ ఆంటోని ఆరోగ్యంపై క్లారిటీ
ఎన్టీఆర్‌ వర్ధంతి నాడు నాగ్‌ అలా..  ఏఎన్నార్‌ వర్ధంతి నాడు బాలయ్య ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement