Akkineni Naga Chaitanya Fun With Venkatesh Daughter - Sakshi
Sakshi News home page

Akkineni Naga Chaitanya: స్టార్‌ హీరో కుమార్తెతో నాగచైతన్య.. ఆమె ఎవరో తెలుసా?

Dec 5 2022 9:07 PM | Updated on Dec 5 2022 9:28 PM

Akkineni Naga Chaitanya Fun With Venkatesh Daughter  - Sakshi

అక్కినేని నాగచైతన్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే మేజర్‌ బ్యూటీ శోభితా ధూళిపాళ్లతో చై డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక సామ్‌తో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పర్సనల్‌ లైఫ్‌పై అనేక రూమర్స్‌ తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా ఓ స్టార్ హీరో కుమార్తె నాగచైతన్యతో కలిసి ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అందులో ఆమె ఓ స్పెషల్​ ఫుడ్ తయారుచేసి చైతూకు తినిపించింది. ఆ వీడియోకు తెగ లైక్స్,​ కామెంట్స్‌తో అభిమానులు విరుచుకుపడుతున్నారు. 

ఇంతకీ ఆమె ఎవరనే కదా మీ సందేహం. ఆ స్టార్ హీరో కుమార్తె మరెవరో కాదండి. విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత దగ్గుబాటి. ఆమె ప్రస్తుతం యూట్యూబ్‌లో  ఫుడ్ వ్లాగ్స్‌ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రకరకాల వంటకాలను తన వ్లాగుల్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఈసారి ఆమె ప్రోగ్రామ్‌కు బావా నాగచైతన్య గెస్ట్‌గా హాజరయ్యారు. చైతూతో కలిసి పలు రకాల వంటకాల తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.  


  

Advertisement
 
Advertisement
Advertisement