లాల్‌ సలామ్‌ డిజాస్టర్‌.. ఆ హీరోతో ప్లాన్ చేస్తోన్న ఐశ్వర్య! | Aishwarya Rajinikanth Ready To Plan Next Movie With Actor Siddharth, Deets Inside - Sakshi
Sakshi News home page

Aishwarya Rajinikanth: లాల్‌ సలామ్‌ డిజాస్టర్‌.. సక్సెస్‌ కోసం ఆ హీరోతో ప్లాన్!

Published Thu, Feb 29 2024 7:20 AM

Aishwarya Rajinikanth Ready To Plan Next Movie With Another Hero - Sakshi

కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్‌ మరో నటుడితో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారా? అని అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. గతంలో ధనుష్‌ కథానాయకుడిగా ఒక చిత్రం, గౌతమ్‌ కార్తీక్‌ కథానాయకుడిగా వై రాజా వై అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఐశ్వర్య రజనీకాంత్‌. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ఐశ్వర్య తర్వాత చిత్రానికి కొంత గ్యాప్‌ తీసుకున్నారు. ఆ తరువాత ఇటీవల తన తండ్రి రజనీకాంత్‌ను గౌరవ పాత్రలో నటింపజేసి రూపొందించిన చిత్రం లాల్‌ సలామ్‌. ఇందులో నటుడు విష్ణువిశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు.

 క్రికెట్‌లోని అసమానతలు, మత విభేదాల గురించి చర్చించిన ఈ చిత్రం కూడా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. తాజాగా ఐశ్వర్య మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్‌ను కథానాయకుడిగా నటింపచేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైనట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పైన ఐశ్వర్యకు హిట్‌ అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement