తెలుగులో ఎంట్రీ ఇస్తున్న హీరో అర్జున్‌ కూతురు! | Sakshi
Sakshi News home page

Arjun Sarja: అర్జున్‌ కూతురు టాలీవుడ్‌ ఎంట్రీ.. హీరో అతడే

Published Thu, May 19 2022 3:06 PM

Aishwarya Arjun To Make Her Tollywood Debut With Vishwak Sen - Sakshi

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్‌కి మాంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక అర్జున్‌ కూతురు ఐశ్వర్యను ఇది వరకే కన్నడలో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ముద్దుగుమ్మను తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం చేయాలని అర్జున్‌ భావిస్తున్నారట.


తన సొంత డైరెక్షన్‌లోనే ఓ స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసుకున్నట్లు సమాచారం. 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విశ్వక్‌సేన్‌ను ఈ సినిమాలో హీరోగా చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement