నా తమ్ముడు అభిరామ్‌ ‘అహింస’ అలరిస్తుంది: రానా

Ahimsa Movie Pre Release Event Highlights - Sakshi

చీరాలలో ‘అహింస’ ప్రీ రిలీజ్‌ వేడుక

సాక్షి, ప్రకాశం(చీరాల): మూవీ మొఘల్‌ డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు మనవడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు ప్రముఖ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్‌ చిత్రరంగంలోకి అరంగ్రేటం చేస్తున్న మొదటి సినిమా అహింస ప్రీ రిలీజ్‌ వేడుక వైభవంగా జరిగింది. శనివారం రాత్రి చీరాలలో స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఈ వేడుక నిర్వహించారు. సినీ నటీనటులను చూసేందుకు వేల సంఖ్యలో సినీ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు తరలి రావడం విశేషం. ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌, హీరోయిన్‌ దీపిక దివని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌, డైరెక్టర్‌ తేజ, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌లు హాజరయ్యారు.

(చదవండి: సీరియల్‌ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?)

ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో సినీ అరంగ్రేటం చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దగ్గుబాటి కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. నూతన హీరో అభిరామ్‌ను అందరు ఆదరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబంతో తమకు సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉన్నాయని నూతన సినీమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చీరాలలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

సినీరంగానికి, చిత్రాల నిర్మాణానికి చీరాల నియోజకవర్గం అనుకూలమన్నారు. అహింస చిత్రం ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలన్నారు. సినీ హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ తన తమ్ముడు అభిరామ్‌ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అందరిని అలరిస్తుందని, ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజల అభీష్టంతో ప్రేక్షకులను హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించి చక్కని పాటలు, సంగీతం ఇచ్చామన్నారు. చీరాలతో మాకు విడదీయరాన్ని సంబంధం ఉందని తమ కుటుంబం సినీరంగం, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రను పొందామని, నూతన నటీనటులను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top