ఇద్దరు స్టార్స్‌ నటించిన పోర్‌ తొళిల్‌ రిలీజ్‌ అయ్యేది అప్పుడే!

Sarath Kumar, Ashok Selvan Starrer Por Thozhil Release On June 9 - Sakshi

నటుడు శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పోర్‌ తొళిల్‌. ఈ 4 ఎక్స్‌పిరిమెంట్స్‌, ఎప్రియస్‌ స్టూడియో సంస్థలతో కలిసి అప్లాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన భారీ చిత్రం ఇది. దర్శకుడు విఘ్నేష్‌ రాజు తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి నిఖిలా విమల్‌ కీలక పాత్ర పోషించారు. కలైసెల్వన్‌ శివాజీ ఛాయాగ్రహణం, జాక్స్‌ బిజాయ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్‌ 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్‌ చైన్నెలో విలేకరులతో ముచ్చటించింది. శరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. సీరియల్‌ హత్యల ఉదంతంతో సాగే ఇన్వెస్టిగేషన్‌, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. హత్యలను ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే పలు ఆసక్తికరమైన అంశాలతో చిత్ర కథ సాగుతుందన్నారు.

నటుడు అశోక్‌ సెల్వన్‌ మాట్లాడుతూ.. థ్రిల్లర్‌ కథా చిత్రంలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్నానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని పేర్కొన్నారు. దర్శకుడు విఘ్నేశ్‌ రాజు మాట్లాడుతూ.. చిత్రాన్ని 42 రోజులలో పూర్తి చేశామని, అందులో ఎక్కువ భాగం రాత్రి వేళ షూటింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులు తమ ఈగోల మధ్య సీరియల్‌ హత్యల మిస్టరీ ఎలా చేధించారు అన్నదే పోర్‌ తొళిల్‌ చిత్రమని చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top