రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా | Adrishya Jalakangal Movie OTT Release Date Tovino Thomas | Sakshi
Sakshi News home page

OTT Movie: వార్ బ్యాక్‌డ్రాప్ మూవీ.. తెలుగులోనూ ఓటీటీ రిలీజ్?

Published Tue, Dec 5 2023 9:02 PM | Last Updated on Tue, Dec 5 2023 9:08 PM

Adrishya Jalakangal Movie OTT Release Date Tovino Thomas - Sakshi

ఓటీటీల వచ్చిన తర్వాత మూవీ లవర్స్ చాలా సదుపాయం అయిపోయింది. ఎందుకంటే మహా అయితే లేదంటే మరోవారం అంతే. హీరో ఎవరనేది సంబంధం లేకుండా ఆయా మూవీస్.. ఓటీటీల్లో రిలీజైపోతున్నాయి. ఇప్పుడు కూడా అలానే ఓ స్టార్ హీరో నటించిన హిట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయింది. కానీ థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే స్మాల్ స్క్రీన్‌పై రానుండటం షాకింగ్ విషయం.

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్‌!)

ఏంటా సినిమా?
మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది రిలీజైన బెస్ట్ సినిమా '2018'. ఇందులో హీరోగా నటించిన టొవినో థామస్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఓటీటీల్లో పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా.. తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల్ని సంపాదించాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'అదృశ్య జలకంగళ్'. వార్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో.. టొవినో డీ గ్లామర్ రోల్ చేశాడు. 

ఓటీటీలో ఎ‍ప్పుడు?
ఈ నవంబరు 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. హిట్ టాక్‌తో పాటు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాంటి ఈ చిత్రాన్ని.. రెండే వారాల్లోకి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. డిసెంబరు 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ఈ సినిమాని నిర్మించింది. ఓటీటీలో కాబట్టి తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ అయిన ఈ మూవీని మరీ రెండు వారాల్లోనే ఓటీటీలో తీసుకొస్తుండటం మూవీ లవర్స్‌కి మంచి కిక్ ఇస్తోంది.

(ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement