తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్‌! | Actress Chitra Shukla Wedding With Police Officer | Sakshi
Sakshi News home page

Chitra Shukla: పోలీస్‌ని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. మెహందీ ఫొటోలు వైరల్

Dec 5 2023 8:07 PM | Updated on Dec 5 2023 8:17 PM

Actress Chitra Shukla Wedding With Police Officer - Sakshi

మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే బిజినెస్‌మ్యాన్ లేదా యాక్టర్‌ని కాకుండా ఓ పోలీస్ అధికారితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా, ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? పెళ్లెప్పుడు?

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?)

మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్రశుక్లా.. 2014లో 'ఛల్ భాగ్' అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమాతో పాటు 'పులి', 'నేను శైలజ' చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించింది. 2016లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'మా అబ్బాయి' మూవీతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో 'రంగుల రాట్నం', సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం,  పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.

మరోవైపు కొన్నాళ్ల ముందు నుంచే వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ డిసెంబరు 8న పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం మెహందీ, హల్దీ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఈ క్రమంలోనే చిత్రశుక్లా.. కాబోయే భర్త వైభవ్‌తో ఉన్న ఫొటోలని పోస్ట్ చేసింది. ఇకపోతే వైభవ్.. మధ్యప్రదేశ్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికైతే చిత్రశుక్లా చేతిలో కొత్త సినిమాలు ఏం లేవు. అంటే ఈ పెళ్లి తర్వాత బహుశా నటనకు టాటా చెప్పేయొచ్చేమో అనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement