Adah Sharma Latest Movie CD First Look Poster Released Today - Sakshi
Sakshi News home page

Adah Sharma: భయపెడతానంటోన్న ఆదాశర్మ.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!

Aug 18 2023 5:07 PM | Updated on Aug 18 2023 5:18 PM

Adah Sharma Latest Movie CD First Look Poster Released Today - Sakshi

ది కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదాశర్మ. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్‌ కథలో ప్రేక్షకుల ముందుకు రానుంది.   క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే హారర్‌ జానర్‌తో అలరించేందు సిద్ధమైంది.  సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సీడీతో ఆదాశర్మ మన ముందుకు రాబోతోంది. డిఫరెంట్ ఫీలింగ్ కలిగింగ్ సరికొత్త స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ మరో లీడ్‌ రోల్ సినిమాలో ఆసక్తి పెంచుతోంది. 

(ఇది చదవండి: ‘స్టార్‌ మా’లో సరికొత్త సీరియల్‌)

సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) చిత్రాన్ని కృష్ణ అన్నం దర్శకత్వంలో తెరకెక్కిస్కున్నారు. ఎస్ఎస్‌సీఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. గిరిధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.  మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దెయ్యాల చేతుల మధ్యన ఆదాశర్మ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.  

పోస్టర్ చూస్తే అదా శర్మ సీరియస్ లుక్‌, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేశారు.  ఈ చిత్రంలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. 

(ఇది చదవండి: ఆ హీరోతో నటించాలని కోరిక.. కానీ ఆ పాత్ర చేయను: రాశి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement