దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ | Actress Tamannaah Blames Instagram Clarifies Her Like On Deepika Padukone, Deets Inside | Sakshi
Sakshi News home page

దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ

May 29 2025 8:01 AM | Updated on May 30 2025 11:01 AM

Actress Tamannaah blames Instagram clarifies her like on Deepika Padukone

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తాజాగా చేసిన ట్వీట్‌తో రెండు రోజులుగా దీపికా పదుకొణె( Deepika Padukone) పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తను తీయబోతున్న సినిమా కథను ఒక స్టార్‌ హీరోయిన్‌ లీక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ  సోషల్‌మీడియాలో ఆయనొక పోస్ట్‌ చేశారు. సందీప్‌ చేసిన కామెంట్స్‌ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సందీప్‌ కామెంట్‌ చేసిన కొన్ని గంటల్లోనే దీపిక కూడా పరోక్షంగా స్పందించింది. ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  'జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది.  

ఆ  వీడియోతో పాటు దీపికకు చెందిన ఒక పాత వీడియోను ఆమె అభిమాని సోషల్‌ మీడియాలో  షేర్‌ చేశాడు.  అగౌరవం, పురుషులు, లింగ వివక్షత, లింగ వేతన వ్యత్యాసం, ఓవర్ టైం పని, వృత్తి నైపుణ్యం లేకపోవడం, స్త్రీ ద్వేషం, ద్వంద్వ ప్రమాణాలు అంటూ చెప్పిన ఆమె మాటలను ఇప్పుడు మళ్లీ వైరల్‌ చేశాడు. దానిని తమన్నా లైక్‌ చేశారని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. అది కాస్త నెట్టింట వైరల్‌ అయిపోయింది. దీపికాకు తమన్నా సపోర్ట్‌ చేస్తుందంటూ పేర్కొన్నారు. అయితే, తాజాగా  తమన్నా వివరణ ఇచ్చింది. తాను ఎవరి పోస్ట్‌కు లైక్‌ కొట్టలేదని తెలిపింది. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. లైక్‌ కొట్టలేదని ఇన్‌స్టాగ్రామ్‌ చెప్పినా నమ్మలేని స్థితిలో కొందరు ఉన్నారని పేర్కొంది. తనకు తానుగా పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ ఎలా లైక్‌ చేస్తుందో చెబితే బాగుంటుందని ఆమె తెలిపింది.  దయచేసి దీనిని ఇంతటితో వదిలేయండి చాలా పనులు ఉన్నాయంటూ  ఆమె వెళ్లిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement