CoronaVirus: తమన్నా తల్లిదండ్రులకు కరోనా | Tamanna Bhatia's Parents Tests Covid Positive - Sakshi
Sakshi News home page

తమన్నా తల్లిదండ్రులకు కరోనా

Aug 26 2020 3:18 PM | Updated on Aug 26 2020 4:04 PM

Actress Tamannaah Bhatia Parents Tested Positive For Corona - Sakshi

మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలతో వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా..

ముంబై : హీరోయిన్‌ తమన్నా భాటియా తల్లిదండ్రులకు కరోనా వైరస్‌ సోకింది. గత కొద్దిరోజులుగా స్వల్ప కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయించగా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు తమన్నా తన ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాలు వెల్లడించింది. బుధవారం ఆమె స్పందిస్తూ.. ‘‘మా అమ్మా, నాన్న గత కొద్ది రోజులుగా కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో ఉన్న వారందరమూ టెస్టులు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చింది. (వైరల్‌గా మారిన తమన్నా పిల్లో చాలెంజ్‌ )

కానీ, నాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరికి నెగిటివ్‌ వచ్చింది. అధికారులు ఎప్పటి కప్పుడు అమ్మా,నాన్నల ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఉన్నారు. మేము కూడా ముందు జాగ్రత్త చర్యల్ని పాటిస్తున్నాము. భగవంతుడి దయ వల్ల వారు ప్రస్తుతం బాగానే ఉన్నారు. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలతో వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’నని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement