ఈమె హిట్ సినిమాల తెలుగు హీరోయిన్.. కానీ అదే పెద్ద మైనస్.. గుర్తుపట్టారా? | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఫస్ట్ మూవీనే స్టార్ హీరోతో చేసింది.. కానీ ఆ తర్వాతే వరస షాకులు!

Published Sun, Jan 28 2024 12:47 PM

Actress Sneha Ullal Movies And Family Details - Sakshi

ఈమె తెలుగు హీరోయిన్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో సక్సెస్ అందుకుంది. బాగానే ఉందనుకునేలోపు వరస దెబ్బలు తగిలాయి. దీంతో స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే ఛాన్సుల్లేక ఎదురుచూసే పరిస్థితికి వచ్చేసింది. ఈ బ్యూటీకి ప్రతిభతో పాటు అన్నీ ఉన్నాగానీ ఓ విషయం మాత్రం ఈమె కెరీర్‌కి మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు స్నేహా ఉల్లాల్. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. అరబ్ దేశం ఒమన్‌లో పుట్టి పెరిగింది. అక్కడ చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లితో కలిసి ముంబయిలో అడుగుపెట్టింది. మరి నక్క తోక తొక్కిందో ఏమో గానీ ఫస్ట్ ఫస్టే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' చిత్రంతో నటిగా మారింది. నటిగా పాజిటివ్ మార్క్స్ పడ్డాయి. కానీ హిట్ మాత్రం తెలుగు డెబ్యూతో దక్కింది.

(ఇదీ చదవండి: కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్)

2007లో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన స్నేహా ఉల్లాల్.. ఫస్ట్ మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 'కరెంట్' చిత్రంతోనూ ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల పర్లేదు గానీ.. నేను మీకు తెలుసా?, సింహా, అలా మొదలైంది, మడతా కాజా, యాక్షన్ త్రీడీ, అంతా నీ మాయలోనే తదితర చిత్రాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ తీసుకురాలేకపోయాయి. ఈ మూవీస్ వల్ల వరస షాకులు తగిలాయి.

మరోవైపు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌లా నీలి కళ్లతో ఉంది అనే పోలిక కూడా ఈమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. సాధారణంగా ఏదైనా పోలిక ఉంటే.. మాట్లాడుకుంటారు తప్పితే ఛాన్సులైతే ఇవ్వరు. అలా ఆ పోలిక వల్ల పెద్దగా ఉపయోగమైతే జరగలేదు. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో సినిమాలేం లేవు. దీంతో సొంత దేశానికి వెళ్లిపోయి.. తల్లిదండ్రులతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది.

(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement