ఎప్పటికీ ఆనందంగా...

భర్త ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా తమ కుమార్తె ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహ. 2012లో తమిళ నటుడు ప్రసన్న, హీరోయిన్ స్నేహ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. బాబు పేరు విహాన్. ఈ ఏడాది జనవరిలో పాపకు జన్మనిచ్చారు స్నేహ. శుక్రవారం ప్రసన్న పుట్టినరోజుని పురస్కరించుకుని పాప ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు స్నేహ. అలాగే ‘‘నా సోల్‌మేట్ (ప్రసన్నని ఉద్దేశించి)కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా లవర్ బాయ్, నా గార్డియన్ ఏంజిల్ తను. మేం ఆనందంగా ఉండాలని దీవిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితం ఎప్పటికీ ఇలా ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు స్నేహ.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి