
హీరోయిన్ సాయిపల్లవి పేరు చెప్పగానే నేచురల్ బ్యూటీ అనే పదమే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పలు భాషల్లో చాలానే సినిమాలు చేసింది గానీ గ్లామర్, రొమాన్స్ విషయంలో గీత దాటలేదు. ఇకపోతే చాలామంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని అంటుంటారు. కానీ ఈమె మాత్రం రెండింటిని భలే మేనేజ్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈమె ఎమ్‌బీబీఎస్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం?
తమిళనాడుకు చెందిన సాయిపల్లవి చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. తెలుగులో డ్యాన్స్ షోలోనూ పార్టిసిపేట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు ఎంబీబీఎస్ చేస్తూనే మరోవైపు నటిగానూ అవకాశాలు దక్కించుకుంది. 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ తదితర చిత్రాలతో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?)
జార్జియా దేశంలో డాక్టర్ చదువు పూర్తి చేసినప్పటి వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ట్విట్టర్(ఎక్స్)లో ఈ వీడియో వైరల్ అవుతుండేసరికి అందరూ ఇది రీసెంట్ వీడియో అనుకుంటున్నారు. కానీ చాలా ఏళ్ల క్రితం వీడియోనే ఇదని తెలుస్తోంది. ఆ మధ్య కొన్నాళ్ల సినిమాలు చేయకపోయేసరికి సొంతూళ్లో హాస్పిటల్ పెట్టనుందని అన్నారు. కానీ అవేవి నిజం కాదని తెలుస్తోంది.
ఎందుకంటే ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు మూవీ 'తండేల్', పాన్ ఇండియా సినిమా 'రామాయణ్' ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత సాయిపల్లవి డాక్టర్ కెరీర్ గురించి ఏమైనా క్లారిటీ రావొచ్చు. అంతవరకు మాత్రం వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉండగా 'తండేల్'.. ఈ ఏడాది డిసెంబరులో లేదంటే నవంబరులో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.
(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!)
Watch #SaiPallavi from her MBBS Graduation Day at Tbilisi State Medical University, Georgia.
The actress will next be seen in #Thandel starring #NagaChaitanya. pic.twitter.com/rWjvSKMzvN— KLAPBOARD (@klapboardpost) July 6, 2024