Is Actress Sai Pallavi Acting In Allu Arjun Pushpa-2 Sequel, News Goes Viral - Sakshi
Sakshi News home page

Pushpa 2 Update: పుష్ప-2లో సాయిపల్లవి.. నిజమేనా?

Published Wed, Mar 8 2023 5:43 PM | Last Updated on Thu, Mar 9 2023 12:48 PM

Actress Sai Pallavi Acting In Allu Arjun Pushpa-2 Sequel Goes Viral - Sakshi

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బన్నీ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి పుష్ప-2లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం సుకుమార్ టీం ఆమె సంప్రదించిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భారీ వసూళ్లు రాబట్టింది. అదే ఊపుతో సీక్వెల్‌గా పుష్ప-2ను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. కాగా.. న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి గతేడాది విరాటపర్వం, గార్గి సినిమాలతో అభిమానులను పలకరించింది. తాజాగా పుష్ప-2 సాయిపల్లవి అలరించనుందనే వార్త విన్న బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం ఎలా  స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement