Actress Poorna (Shamna Kasim) Shares Emotional Video - Sakshi
Sakshi News home page

Actress Poorna: ఊహకు అందని అనుభూతి అంటూ వీడియో షేర్‌ చేసిన నటి

Apr 9 2023 7:13 PM | Updated on Apr 10 2023 8:41 AM

Actress Poorna Shares Emotional Video - Sakshi

నా జీవితంలో ఈ అనుభూతి ఊహకు అందనిది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తనే నా ప్రపంచం. ఇప్పుడు నేను ఒకరికి తల్లినయ్యాను. ఇప్పుడు నేను పరిపూర్ణ స్త్రీగా మారాను' అ

ప్రముఖ నటి పూర్ణ ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! ఏప్రిల్‌ 4న బాబును ఎత్తుకున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులతో పంచుకుంది. బాబు పుట్టిననాటి నుంచి అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తోంది పూర్ణ. తాజాగా ఆమె తనను ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వీల్‌చైర్‌లో మరో గదికి తీసుకువచ్చిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో ఓ గదిని అందంగా ముస్తాబు చేసి బేబీ బాయ్‌ అని గోడపై బెలూన్లతో డెకరేట్‌ చేశారు. ఇదంతా చూసిన పూర్ణ సంతోషంలో తేలియాడింది.

'నా జీవితంలో ఈ అనుభూతి ఊహకు అందనిది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తనే నా ప్రపంచం. ఇప్పుడు నేను ఒకరికి తల్లినయ్యాను. ఇప్పుడు నేను పరిపూర్ణ స్త్రీగా మారాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ గతేడాది దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ను పెళ్లాడింది. కొంతకాలానికే తాను తల్లి కాబోతున్నానంటూ గుడ్‌న్యూస్‌ చెప్పింది. సీమంతం ఫంక్షన్‌ కూడా ఘనంగా నిర్వహించగా అందుకు సంబంధించిన ఫోటోలు సైతం షేర్‌ చేసింది.

ఇకపోతే పూర్ణ 'సీమటపాకాయ్‌' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన 'అవును', 'అవును 2' సినిమాతో గుర్తింపు సంపాదించుకుంది. అఖండ, దృశ్యం 2 వంటి చిత్రాలతో మంచి మార్కులు కొట్టేసింది. ఓపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలోనూ మెరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement