Actress Poonam Kaur Interesting Comments On Acting With Pawan Kalyan, Details Inside - Sakshi
Sakshi News home page

Poonam Kaur : 'పవన్‌తో కావాలనే నన్ను నటించకుండా చేశారు'

Mar 12 2022 8:00 PM | Updated on Mar 12 2022 11:03 PM

Actress Poonam Kaur Intresting Comments On Pawan Kalyan - Sakshi

Poonam Kaur About Pawan Kalyan: హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే వివాదాలతోనే పాపులర్‌ అయిన ఈ బ్యూటీ తన ట్వీట్లతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. తాజాగా పూనమ్‌ నటించిన 'నాతిచరామి' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న పూనమ్‌ తాజాగా పవన్‌కల్యాణ్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

'పవన్‌తో కావాలనే నన్ను నటించకుండా చేశారు. ఆయన గురించి పాజిటివ్‌గా చెప్పినా నెగిటివ్‌గానే అర్థం చేసుకుంటారు.. అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది.. దేవుడా' అంటూ పవన్‌ను తల్చుకొని నవ్వేసింది. కాగా తన కెరీర్‌ను నాశనం చేయడానికి కొందరు ప్రయత్నించారని, దీంతో మానసికంగా ఎంతో నష్టాన్ని చవిచూశానని ఇటీవలె పూనమ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement