Mandira Bedi Husband Raj Kaushal Passed Away - Sakshi
Sakshi News home page

Mandira Bedi: ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత

Jun 30 2021 10:26 AM | Updated on Jun 30 2021 3:22 PM

Actress Mandira Bedi Husband Raj Kaushal Passes Away - Sakshi

ప్రముఖ నటి, యాంకర్‌ మందిరా బేడి ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త రాజ్‌ కౌశల్‌ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రాజ్‌ బాలీవుడ్‌లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్యార్‌ మే కబీ కబీ, షాదీ కా లడ్డు వంటి చిత్రాలను తెరకెక్కించాడు.

కొన్నేళ్ల క్రితం మందిరా బేడిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక్క కుమారుడు. అలాగే గతేడాది ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఇక మందిరా విషయానికి వస్తే.. పలు హిందీ చిత్రాలతో పాటు, సిరియల్స్‌, వెబ్‌ సీరిస్‌ల్లో నటించింది. ద‌క్షిణాదిన శింబు మ‌న్మ‌థుడు, ప్ర‌భాస్ సాహో చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌ మృతి పట్ల బాలీవుడ్‌  పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.




చదవండి:
‘హ్యాపీడేస్‌’ అప్పు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement