ఈమె ఒకప్పటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడేమో ఫ్యాషన్ డిజైనర్.. గుర్తుపట్టారా? | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఇంట్లో అందరూ స్టార్ హీరోయిన్లే.. ఈమె కూడా అదే కాకపోతే!

Published Sun, Jan 21 2024 9:16 PM

Actress Maheswari Latest Pics And Family Details - Sakshi

ఈమె తెలుగు హీరోయిన్. మంచి మంచి హిట్ సినిమాలు చేసింది. జస్ట్ ఐదేళ్లలో ఏకంగా 30 సినిమాలు చేసింది. కానీ ఏమైందో ఏమో సడన్‌గా యాక్టింగ్ కెరీర్‌కి టాటా చెప్పేసింది. అయితే ఈమె పేరు చెబితే కొన్ని మూవీస్ గుర్తొస్తాయి. అలానే ఓ స్టార్ హీరోయిన్ కూడా గుర్తొస్తుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మహేశ్వరి. గుర్తొచ్చిందా? అవును మీరనుకున్న బ్యూటీనే. అతిలోక సుందరి శ్రీదేవికి ఈమె బంధువు అవుతుంది. అంటే ఈమె.. శ్రీదేవి అక్కకు పుట్టిన కూతురు. చెన్నైలో పుట్టి పెరిగిన మహేశ్వరి.. 1994లో ఇండస్ట్రీలోకి వచ్చింది. తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చాలావరకు తెలుగు చిత్రాలే చేసింది. ఈమె చేసిన వాటిలో 'పెళ్లి', గులాబీ, దెయ్యం లాంటి హిట్ సినిమాలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎందుకో అకస్మాత్తుగా నటన పూర్తిగా పక్కనబెట్టేసింది.

(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)

1994-2000 వరకు దాదాపు 30కి పైగా సినిమాలు చేసిన మహేశ్వరి.. యాక్టింగ్ పక్కనబెట్టేసిన తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉంది. అలా 2008లో గుంటూరుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక 2010లో సీరియల్ యాక్టర్‌గా కెరీర్ షురూ చేసింది. ఓ నాలుగేళ్లు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన తర్వాత దాన్ని కూడా పక్కనబెట్టేసింది. ఇక ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ వస్తోంది. 

ప్రస్తుతం మహేశ్వరి.. ఫ్యాషన్ డిజైనర్‌గా డిఫరెంట్ కెరీర్‌ని ఎంచుకుంది. హైదరాబాద్‌లో ఈమెకు ఓ స్టోర్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్‌తో మహేశ్వరి అప్పుడప్పుడు కనిపిస్తోంది. వరసకు వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు అవుతారు. కానీ మహేశ్వరి ఒకప్పుడు హీరోయిన్ కాగా.. జాన్వీ మాత్రం ఇప్పుడిప్పుడే కథానాయికగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది.

(ఇదీ చదవండి: ఎక్స్‌పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా)

Advertisement
 
Advertisement