ఆయన తగ్గలేదు.. నేనే లావెక్కుతా: మహాలక్ష్మి | Sakshi
Sakshi News home page

Mahalakshmi-Ravindran Chandrasekaran: ఆయన తగ్గలేదు.. నేనే లావెక్కుతా: మహాలక్ష్మి

Published Tue, Dec 12 2023 7:49 AM

Actress Mahalakshmi Comments On Ravindar Chandrasekaran Weight - Sakshi

తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి వివాహం తర్వాత చాలా మంది నుంచి ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో భారీగా వైరల్‌ అయ్యాయి. వివాహం తర్వాత రవీందర్‌ చాలా అవహేళనలు ఎదుర్కొన్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మితిమీరిన బరువు ఉండటమే..  మహాలక్ష్మి మాత్రం నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ జంట మాత్రం లైఫ్‌ను ఆనందంగానే లీడ్‌ చేస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త గురించి ఓపెన్‌గా చెప్పింది. తనను ఎక్కువగా బాధపెట్టిన దాని గురించి బహిరంగంగా మాట్లాడింది. 'మా పెళ్లి సందర్భంగా చాలా మంది ట్రోల్స్‌ చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు. అలాగే నా భర్త రవీందర్ బరువు ఎక్కువగా ఉండడంతో ఆయన కోసం నేనూ బరువు పెరిగేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. బరువు తగ్గాలని రవీందర్‌ ఎంత ప్రయత్నం చేసినా అది కుదరడం లేదు.. కాబట్టి నేనే ఆయన మాదిరి బరువు పెరగాలని చూస్తున్న. బరువు పెరిగేందుకు నేను అధికంగా కొవ్వు పదర్థాలు కూడా తీసుకుంటున్నాను.

ఆర్ధరాత్రి సమయంలో ఎక్కువగా ఫుడ్‌ తింటున్నాను. ఆ సమయంలో నాకు నిద్ర కూడా పోతుంది. ఎలాగైనా నేను కూడ ఆయనలా మారాలి. అప్పుడైనా ఈ ట్రోల్స్‌ ఆగిపోతాయి అనుకుంటా.' అని ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ తన భర్త రవీందర్‌ జుట్టు నెరిసిపోవడం  చాలా బాధగా ఉందని ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మహాలక్ష్మి నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తన భర్త చెప్పినా అందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. ఏమేమైనా త్వరలో బరువు పెరగాలనే ఆలోచనతో మహాలక్ష్మి ఉంది.  ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు కోలీవుడ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

మహాలక్ష్మి, రవీందర్‌ ఇద్దరిదీ కూడా  రెండో పెళ్లినే..  ఇద్దరికీ మొదటి వివాహం నుంచి ఒక బిడ్డ ఉంది.  మొదటి వివాహం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.పెళ్లి సమయంలో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ని పెళ్లిచేసుకుందని, అతని సంపద చూసి నటి పెళ్లికి సిద్ధమైందని పలువురు చెప్పారు. అంతేకాదు మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పొందడానికి నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశారని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి.

అయితే ట్రోల్స్‌ను అధిగమించి మంచి వైవాహిక జీవితాన్ని గడపగలమని వారు చాలాసార్లు నిరూపించారు. ఆ మధ్య వారిద్దరూ విడాకులు తీసుకున్నారనే పుకార్లు వచ్చాయి. వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. ఆ మధ్య రవీందర్‌పై చీటింగ్‌ కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకున్నారంటూ నిర్మాతపై కేసు నమోదైంది. చివరికి ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement