ఈ పాప తెలుగు హీరోయిన్.. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. ఎవరో కనిపెట్టారా? | Actress Isha Talwar Childhood Photos And Telugu Movies List | Sakshi
Sakshi News home page

Guess The Actress: 40కి దగ్గర పడుతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Jan 2 2024 9:25 PM | Updated on Jan 3 2024 8:44 AM

Actress Isha Talwar Childhood Photos And Telugu Movies - Sakshi

ఈమె తెలుగు హీరోయిన్. అంటే పదుల సంఖ్యలో సినిమాలేం చేసేయలేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత ఇక్కడ మూవీస్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. దీంతో ఛాన్సులే రావడం మానేశాయి. అయితేనేం బాలీవుడ్‌లో చెక్కేసింది. సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్మే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇషా తల్వార్. అరె.. ఈ పేరు ఎక్కడా గుర్తురావట్లేదే? అని అనుకుంటున్నారా? అస్సలు కంగారు పడకండి. మేం చెప్పేస్తాం. అప్పట్లో 'ఇష్క్' మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన నితిన్.. అదే ఊపులో 'గుండె జారి గల్లంతయ్యిందే' అని మరో మూవీ చేశాడు. ఇందులో నిత్యామేనన్ మంచి స్కోప్ ఉండే పాత్ర చేసింది. అదే టైంలో మరో హీరోయిన్‌గా చేసిన ఇషా తల్వార్ కూడా బాగానే ఫేమ్ తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!)

అయితే నితిన్ మూవీ తర్వాత 'మైనే ప్యార్ కియా', 'రాజా చెయ్యి వేస్తే' అని మరో రెండు సినిమాల్లో ఇషా తల్వార్ హీరోయిన్‌గా చేసింది. కానీ లక్ అన్నదే అస్సలు కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వరసపెట్టి మలయాళ మూవీస్ చేసింది గానీ టాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మాత్రం పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. 

హీరోయిన్ అనే కాకుండా 'మీర్జాపూర్' లాంటి ఫేమస్ వెబ్ సిరీస్‌లోనూ గుర్తింపు ఉన్న పాత్ర చేసింది. 2023లోనూ సాస్-బాహు ఔర్ ఫ్లెమింగో, చమక్ లాంటి సిరీసుల్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే అటు మూవీస్ ఇటు సిరీసులు చేసుకుంటూ బండి నడిపేస్తోంది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 36 ఏళ్లు వయసొచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement