తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా | Actress Ileana Comments On Telugu Movie Chances | Sakshi
Sakshi News home page

Ileana: తెలుగు సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి కారణం ఇదే

May 7 2024 12:23 PM | Updated on May 7 2024 12:55 PM

Actress Ileana Comments On Telugu Movie Chances

కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన కెరీర్‌ని డిసైడ్ చేస్తాయి. సినిమా యాక్టర్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఇలియానా పరిస్థితి ఇలాంటిదే అని చెప్పొచ్చు. 'దేవదాస్‌' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్‌ బాబుతో చేసిన 'పోకిరి' హిట్ కావడంతో ఫేట్ మారిపోయింది. స్టార్‌ హీరోలతో కలిసి మూవీస్ చేసింది. తమిళంలో చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీలో చేసిన ఓ మూవీ ఈమె కెరీర్ ఖతమయ్యేలా చేసింది!

(ఇదీ చదవండి: RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్‌ ఏంటో తెలుసా..?)

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న టైంలో ఇలియానా.. బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 'బర్ఫీ' మూవీ చేసింది. హిందీ చిత్రాలు చేస్తే చేసింది గానీ దక్షిణాది దర్శకులని కించపరచేలా కామెంట్స్ చేసింది. దీంతో ఈమెని తెలుగు, తమిళ దర్శకులు పట్టించుకోవడం మానేశారు. మరోవైపు మైకేల్‌ టోలన్‌ అనే విదేశీయుడితో ప్రేమలో పడి, చాన్నాళ్లు అతడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం హిందీ సినిమాల్లో మాత్రమే చేస్తున్న ఇలియానా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఛాన్సులు ఆగిపోవడం గురించి మాట్లాడింది.  తెలుగు, తమిళ సినిమాల్లో చేస్తున్నప్పుడు హిందీలో 'బర్ఫీ'లో ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో వదులుకోలేకపోయాను. దీంతో హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నానని.. దక్షిణాది చిత్రాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలు వచ్చింది. అందుకే సౌత్‌లో అవకాశాలు రావడం లేదని ఇలియానా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)

Advertisement
 
Advertisement
Advertisement