‘స్టూడెంట్‌ నెంబర్ 1’ హీరోయిన్‌ గజాల ఇప్పుడెలా ఉందో తెలుసా? | Actress Gajala Present Real Life Secrets In Telugu | Sakshi
Sakshi News home page

ప్రేమ, ఆత్మహత్యాయత్నం.. గజాల గురించి ఈ విషయాలు తెలుసా?

Aug 6 2021 4:47 PM | Updated on Aug 7 2021 12:29 PM

Actress Gajala Present Real Life Secrets In Telugu - Sakshi

Gajala Present Life: సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ వందల మందిలో ఒకరిద్దరే సక్సెస్‌ అవుతారు. కొంతమందికి వేగంగా సక్సెస్‌ వస్తే.. మరికొంతమందికి ఆసల్యం అవుతుంది. ఇంకొంత మందికి ఎన్నేళ్లయినా విజయం వరించదు. ఇలా సినిమా ప్రపంచంలో ఎంతోమంది తారలు అభిమానులను మెప్పించి, మురిపించారు. పదుల సంఖ్యలో సినిమాలు చేసి అలరించారు. టాప్‌ హీరోయిన్‌గా మెరిసి, తర్వాత వివాహం చేసుకొని విదేశాల్లో సెటిల్‌ అయ్యారు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించి, అగ్రహీరోల పక్కన నటించి సడెన్‌గా మాయమైన హీరోయిన్లలో గజాల ఒకరు. 

ఒక్కప్పుడు ఈ భామ టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. 2001లో జగపతి బాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గజాల.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరో నటించిన స్టూడెంట్‌ నెంబర్ 1 సినిమాతో స్టార్‌ హీరోయిన్ల సరసన నిలిచింది. ఆ సినిమా తర్వాత గజాల వెనక్కి తిరిగి చూసుకోలేదు. అల్లరి రాముడు, ఓ చిన్నదాన, రామ్, మనీ మనీ మోర్ మనీ, అదృష్టం, జానకి వెడ్స్ శ్రీరామ్, భద్రాద్రి, మద్రాసి, శ్రావణ మాసంతో కలిసి దాదాపు 30 తెలుగు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ నటించే అవకాశం ఈ బ్యూటీని వరించింది. 

గజాల అసలు పేరు రాజి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును గజాలగా మార్చుకుంది. పేరు మార్చుకున్నాక తనకు అదృష్టం కలిసొచ్చిందని ఓ సందర్భంలో గజాల చెప్పింది.  ఇక కెరీర్ పీక్స్ టైం లోనే  ఆమె ఆత్మహత్యాయత్నం చెయ్యడం అప్పట్లో పెద్ద దుమారం రేపిన సంగతితెలిసిందే. రాజశేఖర్ హీరో గా నటిస్తున్న భరత సింహ రెడ్డి సినిమా షూటింగ్ సమయం లో గజాల నిద్ర మాత్రలు మింగినట్టు అప్పట్లో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఓ యువ హీరోతో ప్రేమలో పడి, అది చెడడంతో ఆత్మహత్యాయత్నం చేసిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఆ సినిమా నిర్మాత మాత్రం హోటల్ లో తిన్న ఫుడ్ సరిగా లేకపోవడం వల్లే ఆమె అనారోగ్యం కి గురి అయ్యింది అని, మూడవ రోజే ఆమె పూర్తిగా కోలుకొని షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టింది అని చెప్పడం విశేషం.


ఇక ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అగ్ర హీరోయిన్స్ లో ఒక్కరిగా చలామణి అయినా గజాల 2011 లో విడుదల అయినా మనీ మనీ మరి మనీ అనే సినిమా తర్వాత సినిమాలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసింది. 2016లో టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్‌ను వివాహం చేసుకొని ముంబైలో స్థిరపడింది. ఆమె కుటుంబం మొత్తం కువైట్‌లో సెటిల్‌ అయింది. మస్కట్‌లో ఆమె తండ్రి పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. ధారణంగా చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత వాళ్ళ ముఖాలు ఎవ్వరు గుర్తు పట్టలేనంత గా మారిపోతుంది , కానీ గజాల మాత్రం 20 సంవత్సరాల క్రితం ఎంత అందం గా ఉండిందో ఇప్పటికి అంతే అందం గా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement