Actress Archana Gautam Recalls Delivering Cylinders in Childhood - Sakshi
Sakshi News home page

Archana Gautam: సిలిండర్లు మోస్తే రూ.10 ఇచ్చేవారు..

Feb 18 2023 2:05 PM | Updated on Feb 18 2023 3:22 PM

Actress Archana Gautam Recalls Delivering Cylinders in Childhood - Sakshi

'మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడటంతో నేను కూడా ఏదో ఒక పని చేసేదాన్ని. 2007-08 సంవత్సరంలో ఖాళీ సిలిండర్లను సైకిల్‌ లేదా బండిపై తీసుకెళ్లి ఇచ్చేదాన్ని. ఇందుకుగానూ రూ.10-20 దాకా ఇచ్చేవారు.

హిందీ బిగ్‌బాస్‌ 16వ సీజన్‌ కంటెస్టెంట్‌ అర్చన గౌతమ్‌  ఇండస్ట్రీకి రావడానికి ముందు ఎన్నో కష్టాలు పడింది. కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉండటంతో ఖాళీ సిలిండర్లు మోసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టి పెరిగిన ఆమె పని కోసం ముంబైకి వలస వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో తాను బాల్యం నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టింది.

'మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడటంతో నేను కూడా ఏదో ఒక పని చేసేదాన్ని. 2007-08 సంవత్సరంలో ఖాళీ సిలిండర్లను సైకిల్‌ లేదా బండిపై తీసుకెళ్లి ఇచ్చేదాన్ని. ఇందుకుగానూ రూ.10-20 దాకా ఇచ్చేవారు. ఇక నా మొదటి జాబ్‌ టెలీకాలర్‌. నాకు ఆరువేల జీతం ఇచ్చారు. కానీ పెద్దగా ఇంగ్లీష్‌ రాకపోయేసరికి నన్ను ఉద్యోగంలోంచి పీకేశారు. ఆ తర్వాత పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసేదాన్ని. చివరగా నేను పని చేసిన కంపెనీ మూతపడటంతో గతి లేని స్థితిలో సొంతూరికి వెళ్లిపోయాను' అని చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌ 16వ సీజన్‌ టాప్‌ 5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిల్చిన అర్చన పలు అందాల పోటీల్లో రాణించింది. మిస్‌ ఉత్తరప్రదేశ్‌ 2014, మిస్‌ బికినీ ఇండియా 2018, మిస్‌ బికినీ యూనివర్స్‌ 2018గా నిలిచింది. జంక్షన్‌ వారణాసి అనే ఐటం సాంగ్‌లో అతిథి పాత్రలో మెరిసింది.

చదవండి: త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్స్‌ తీసుకున్న హన్సిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement