నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి | Actress Abhinaya Engaged With Childhood Friend | Sakshi
Sakshi News home page

Abhinaya: చిన్నప్పటి స్నేహితుడితో ప్రేమ.. ఇప్పుడు ఎంగేజ్ మెంట్

Mar 9 2025 3:32 PM | Updated on Mar 9 2025 3:53 PM

Actress Abhinaya Engaged With Childhood Friend

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ నిశ్చితార్థం చేసుకుంది. పుట్టుకతోనే ఈమె బధిరురాలు. అంటే మాట్లాడలేదు, వినబడదు. కానీ నటిగా వరస సినిమాలు చేస్తోంది. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది.

(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ)

చెన్నైకి చెందిన అభినయ.. 2008 నుంచి దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దమ్ము, ధృవ, శంభో శివ శంభో, సీతారామం తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. రీసెంట్ గా 'పని' అనే మలయాళ మూవీలో హీరోయిన్ గానూ చేసింది.

కొన్నాళ్ల క్రితం హీరో విశాల్ తో ఈమె రిలేషన్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. వాటిని తోసిపుచ్చిన అభినయ.. తాను 15 ఏళ్లుగా తన చిన్నప్పటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పింది. అందుకు తగ్గట్లే ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. కాకపోతే కాబోయే భర్త ముఖం, వివరాలు లాంటివి బయటపెట్టలేదు.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement