అక్క మరణానికి ప్రతీకారం.. బావమరిది చేతిలో నటుడు హత్య?

Actors Assassination may be Linked to wife Death - Sakshi

యశవంతపుర (బెంగళూరు): మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్‌ వజ్ర (36) శుక్రవారం రాత్రి బెంగళూరులో హత్యకు గురయ్యాడు. మూడు నెలల క్రితమే ఆయన భార్య ఆత్మహత్య చేసుకొంది. బెంగళూరులోనే నివాసం ఉంటూ టీవీ, యూట్యూబ్‌ చానెళ్లలో నటించి పేరు పొందిన సతీష్‌ ఇటీవల లగోరి అనే చిన్న సినిమాలోనూ నటించాడు.

ఇంట్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలతో దాడి చేసి చంపారు. అక్క అకాల మరణానికి ప్రతీకారంగా భార్య తమ్ముడే హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. రాజరాజేశ్వరినగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (పరీక్షల్లో ఫెయిల్‌.. ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top