పరీక్షల్లో ఫెయిల్‌.. ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం

Three Inter Students Commits Suicide over Failure in Exam - Sakshi

బనశంకరి: ద్వితీయ పీయూసీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని ఆవేదన చెంది ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పాసైనా, 90 శాతం మార్కులు రాలేదని బాధతో మరో  విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఉత్తరకన్నడ జిల్లా కుమటావాసి ప్రణమ్‌ ఈశ్వరనాయక్‌ (18), గదగ తాలూకావాసి పవిత్ర లింగదాళ (18), మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకావాసి ఎంజే స్పందన (17), కొడగు జిల్లా బసవనహళ్లివాసి సంధ్య (17) ఈ అకృత్యానికి పాల్పడ్డారు. వీరిలో అందరూ కూడా ఉరి వేసుకుని తనువు చాలించారు. విశ్రాంత జవాన్‌ కూతురైన సంధ్య 77 శాతం మార్కులతో ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది. కానీ 90 శాతం పైగా వస్తాయని ఆశించి నిరాశకు గురైంది. ఈ బాధతో ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.  

చదవండి: (ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా)

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top