మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్‌కాంత్.. అదే కారణం? | Actor Vijaykanth Admitted Again In Hospital, Check His Health Condition Details - Sakshi
Sakshi News home page

Vijayakanth Health Condition: మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్‌కాంత్

Published Wed, Dec 27 2023 8:43 AM

Actor Vijaykanth Admitted Again In Hospital - Sakshi

కొన్నాళ్ల ముందు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్.. కోలుకుని ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఈయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది రెగ్యులర్ చెకప్ కోసమేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అంటున్నారు. 

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?)

ఇకపోతే తమిళంలో పలు సినిమాల్లో హీరోగా నటించిన విజయ్‌కాంత్ చాలా ఫేమ్ సంపాదించారు. ఓ వైపు సినిమాలు చేస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011-16 మధ్య తమిళనాడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇలా నటుడు, పొలిటీషియన్ కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. 

విజయ్‌కాంత్ పూర్తి పేరు విజయరాజ్ అలగర్‌స్వామి. 1952 ఆగస్టు 25లో పుట్టారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయన పేరు కాస్త కెప్టెన్ విజయ్‌కాంత్‌గా మారిపోయింది. విజయ్‌‌కాంత్‌ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో ఒకబ్బాయి ఆల్రెడీ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ఇకపోతే 70 ఏళ్ల విజయ్‌‌కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఇలా ఆస్పత్రి పాలవుతున్నారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్‌ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్)

Advertisement
 
Advertisement
 
Advertisement