ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా? | Bigg Boss Maanas Buys Benz Car Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Bigg Boss Maanas Benz Car Pics: బెంజ్ కారు కొనేసిన మానస్.. ఫొటోలు వైరల్

Published Tue, Dec 26 2023 10:05 AM

Bigg Boss Maanas New Benz Car Pics Viral - Sakshi

బిగ్‌బాస్ షో, తెలుగు సీరియల్ ప్రేక్షకులకు మానస్‌ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. ఇప్పుడు సీరియల్స్‪‌లో నటిస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా ఖరీదైన బెంజ్ కారు కొనేశాడు. ఇంతకీ ఆ కారు రేటు ఎంతంటే? 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే)

'కాయ్ రాజా కాయ్', 'ప్రేమికుడు' తదితర సినిమాల్లో మానస్ హీరోగా నటించాడు. కానీ బిగ్ స్క్రీన్ పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ 5వ సీజన్‌లో పాల్గొని ఫినాలే వరకు వచ్చాడు కానీ విజేతగా నిలవలేకపోయాడు. అయితేనేం ఫేమ్ తెచ్చుకుని 'బ్రహ్మముడి' అనే సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారిపోయాడు.

నవంబరు 23న చెన్నెకి చెందిన శ్రీజ అనే అమ్మాయిని మానస్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నెల తిరిగేలోపు ఖరీదైన బెంజ్ ఎఫ్220డీ కారుని కొనుగోలు చేశాడు. ఇదే విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ కారు ఖరీదు.. దాదాపు రూ.85-90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా సరే మొన్నే పెళ్లి చేసుకుని, ఇప్పుడు కారు కూడా కొనేశాడు. అదిరిందయ్యా చంద్రం!

(ఇదీ చదవండి: మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు!)

Advertisement
 
Advertisement
 
Advertisement