Actor Varun Dhawan Hand Injury Director Atlee - Sakshi
Sakshi News home page

Varun Dhawan: కొత్త సినిమా.. గాయపడ్డ హీరో వరుణ్!

Published Sun, Aug 13 2023 8:01 AM

Actor Varun Dhawan Hand Injury Director Atlee - Sakshi

బాలీవుడ్ హీరోలందరూ సౌత్ డైరెక్టర్లపై మనసు పారేసుకుంటున్నారు! ప్రస్తుతం అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ ధావన్.. దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. షారుక్‌తో 'జవాన్' తీసిన తమిళ దర్శకుడు అట‍్లీ.. వరుణ్ ధావన్ సినిమాని మాత్రం నిర్మిస్తున్నాడు. కలీస్ దర్శకుడు. ఇదంతా పక్కనబెడితే షూటింగ్ మొదలైన రోజే హీరో గాయపడ్డాడనే వార్త అభిమానుల్ని కంగారు పెట్టింది.

(ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు)

'బవాల్' సినిమాతో ఈ మధ్య ప్రేక్షకుల్ని పలకరించిన వరుణ్ ధావన్.. 'VD18' వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ప్రోమో కోసం కీలక ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఓ యాక్షన్ సీన్‌లో భాగంగా పట్టుతప్పి కిందపడిపోయిన వరుణ్ మోచేతికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఇతడు.. 'నో పెయిన్ నో గెయిన్' (ఫలితం కావాలంటే నొప్పిని భరించాలి) అని రాసుకొచ్చాడు. 

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేశ్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. వామిక గబ్బి మరో హీరోయిన్‌. ఇదిలా ఉండగా గతేడాది 'భేడియా' చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్.. మొన్నీ మధ్య 'బవాల్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే పెట్టుకుని, గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!)

Advertisement
 
Advertisement
 
Advertisement