
మార్కోతో మోస్ట్ వయొలెన్స్‌ను అభిమానులకు పరిచయం చేసిన హీరో ఉన్ని ముకుందన్. గతేడాది థియేటర్లలో విడుదలైన మార్కో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాలో విపరీతమైన వయోలెన్స్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమైంది. కొత్త ఏడాదిలో గెట్ సెట్ బేబీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులోనూ ఉన్ని ముకుందన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే తాజాగా ఉన్ని ముకుందన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మాజీ మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చాలా కాలంగా ఉన్ని ముకుందన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు తెలిపారు. తనపై నటుడు ఉన్ని ముకుందన్ దాడి చేయించారని విపిన్ కుమార్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అన్నీ అవాస్తవాలే..
తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై ఉన్ని ముకుందన్ స్పందించారు. అతను చేసేవన్నీ అసత్య ఆరోపణలేనని అన్నారు. అతనిపై ఎలాంటి భౌతిక దాడి జరగలేదని వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అసలు దాడి చేసినట్లు చెబుతున్న విపిన్ కుమార్‌ను తన మేనేజర్‌గా కూడా నియమించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను దాడి చేయించానని వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
ఉన్ని ముకుందన్ తన పోస్ట్‌లో రాస్తూ.. "2018లో నా సొంత నిర్మాణంలో నా మొదటి చిత్రాన్ని నిర్మించబోతున్నప్పుడు విపిన్ కుమార్ నన్ను సంప్రదించాడు. ఆయనను నా వ్యక్తిగత మేనేజర్‌గా ఎప్పుడూ నియమించలేదు. అతను చెప్పినట్లుగా ఎలాంటి భౌతిక దాడి జరగలేదు. అతను చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, అవాస్తవం. మేమున్న ప్రదేశమంతా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని' రాసుకొచ్చారు.
అతని పరిశ్రమలోని కొంతమంది స్నేహితుల మద్దతు ఉందని చెబుతున్నారు.. నా డేటా అంతా అతని వద్ద ఉండటంతో.. నేను ఆయనను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పమని అభ్యర్థించానని ఉన్ని ముకుందన్ తెలిపారు. కానీ అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కానీ నాపై న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియాలో పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఉన్ని ముకుందన్ వెల్లడించారు.
